21 July, 2026 | 8:47 PM

ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల నూతన కార్యవర్గం ఎన్నిక

21-07-2026 05:22 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ కళాశాల గెజిటెడ్ అధ్యాపక సంఘం (TGCGTA) ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ యూనిట్ అధ్యక్షుడు గా డాక్టర్ K సూర్య సాగర్, కార్యదర్శి గా కుంట శ్రీహరి లు ఏకగ్రీవం గా ఎన్నికైనారు. ఎన్నికల అధికారిగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ యు గంగాధర్ వ్యవహరించారు. ఎన్నికైన అభ్యర్థులను కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం సుధాకర్, TGOs ప్రెసిడెంట్ డాక్టర్ పిజి రెడ్డి అభినందించారు.