28 February, 2026 | 12:21 AM

నదీ జలాల్లో చుక్క నీటిని వదులుకోం

25-02-2026 12:00 AM

బీఆర్‌ఎస్ తప్పిదంపై నీటి పోరాటం చేస్తాం

కృష్ణ ట్రిబ్యునల్, కేంద్ర ప్రభుత్వం.. 

అవసరమైతే సుప్రీంకోర్టులో వాదనలను వినిపిస్తాం

నీటిపారుదలశాఖ- మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

సూర్యాపేట జిల్లాలో జవహర్ జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలన

పాలకవీడు, ఫిబ్రవరి 24: కృష్ణ, గోదావరి నదీ జలాల్లో చుక్క నీరును వదులుకునే ప్రసక్తి లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్ పహాడ్ గ్రామంలో జవహర్ జా న్ పహాడ్ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జోహార్ లిఫ్ట్ ను మరో వంద కోట్లు ఎస్టిమేషన్ పెంచి పదివేల ఎకరాలకు సాగునీరు అందించే విధం గా లిఫ్ట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం చేసిన తప్పిదంపై నీటి పోరాటం చేస్తామని, కృష్ణ, ట్రిబ్యునల్, కేంద్ర ప్రభుత్వంపై అవసరమైతే సుప్రీంకోర్టులో తమ వాదనలను వినిపిస్తామన్నారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కృష్ణ, గోదావరి జిల్లాలలో 512 క్యూసెక్కుల నీళ్లను ఆంధ్రకు ఇచ్చి 209 క్యూసెక్కుల నీరు తమకు సరిపోతాయని బీఆర్‌ఎస్ అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 512 క్యూసెక్కులు తెలంగాణకు ఇచ్చి 299 టీఎంసీలు ఆం ధ్రకు తీసుకుపోవాలని చెప్పామన్నారు. దేశంలో అన్ని రా ష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం చరిత్రలోనే ఎక్కువ దిగుబడిన సాధించిన రాష్ట్రంగా ఉందని స్పష్టం చేశారు. కాగా జవ హర్ జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకం పనులను త్వరితగతిన చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.

ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేయండి

హుజూర్‌నగర్: రాష్ట్ర చరిత్రలో ఒకే చోట 2,160 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి పేదలకు అందిస్తున్నామని పౌరసర ఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలో రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాలలో 125 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇండ్ల ప్లాట్లను హౌజింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి పరిశీలించారు.

అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. 2011లో ఆనాడు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో నిరుపేదలు, వ్యవసాయ కూలీలు, రైస్ మిల్లులో పనిచేసే వారికి ఆశ్రయం కల్పించాలన్న లక్ష్యంతో 110 ఎకరాల దేవాలయ భూములను మార్కెట్ రేటుకి కొనుగోలు చేసి పనులు ప్రారంభించామని చెప్పారు.

కానీ రాష్ట్ర విభజన అనంతరం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను మధ్యలోనే నిలిపివేసి డం పింగ్ యార్డ్ మాదిరిగా మార్చిందని మండిపడ్డారు. కాం గ్రెస్ అధికారంలోకి వచ్చాక 14 సంవత్సరాల నా పట్టుదల, కృషి ఆకాంక్షలతో తిరిగి పనులను పునప్రారంభించి ప్రాజెక్టును పూర్తిచేసి పేద ప్రజలకు అందించడంతో నా చిరకాల స్వప్నం నెరవేరుతుందన్నారు. ఒక్కో ప్లాట్‌కు రూ.6 లక్షలు ఖర్చు చేసినట్టు తెలిపారు.

ఒక్క ఫ్లాట్ విస్తీర్ణం 325 స్క్వేర్ ఫీట్ ఉంటుందని వివరించారు. రూ.75 కోట్లతో అంతర్గత రోడ్లు, ఎలక్ట్రిసిటీ, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ కొరకు ప్రభుత్వం నుంఇ మంజూరు చేయించి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించినట్లు తెలిపారు. మార్చి మొద టి వారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా మొదటి విడతలో హుజూర్ నగర్ పట్టణంలో ఇండ్లు లేని నిరుపేదలు, తెల్ల రేషన్ కార్డు కలిగిన వెయ్యి మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రెండవ విడతలో హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పేదలకు అందిస్తామన్నారు.

లబ్ధిదారుల ఎంపిక కమిటీలో ఆర్డీవో, మున్సి పల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, తహసీల్దార్లు ఉండి, పారదర్శకంగా ఎంపిక చేయాలని ఆదేశించారు. అవినీతికి, అవకతవకలకు  పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రి వెంట ఎస్పీ నరసింహ, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీ రు మల్లికా ర్జున్, మార్కెట్ కమిటీ చైర్మ న్ రాధికఅరుణ్ కుమార్, యరగని నాగన్న, దొంగరి వెంకటేశ్వర్లు ఉన్నారు.