13 August, 2026 | 3:52 PM

బుగ్గపల్లి నీటి శుద్ధి ప్లాంట్‌ పరిశీలన

13-08-2026 02:35 PM

వనపర్తి,(విజయక్రాంతి): పెద్దమందడి మండలం బుగ్గపల్లిలోని 75 ఎంఎల్‌డీ మిషన్‌ భగీరథ నీటి శుద్ధి ప్లాంట్‌ను జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి గురువారం పరిశీలించారు. నీటి శుద్ధి ప్రక్రియ, ఫిల్టరేషన్‌, నీటి నాణ్యత పరీక్షలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్లాంట్‌ నుంచి ప్రజలకు చేరే వరకు నీటి నాణ్యతలో ఎలాంటి మార్పు లేకుండా క్షేత్రస్థాయిలోనూ క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీరు అందేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా మొక్క నాటారు.