13 August, 2026 | 4:58 PM

ఇబ్రహీంపట్నం ప్రభుత్వ కళాశాలలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు

13-08-2026 03:34 PM

ఇబ్రహీంపట్నం ఆగష్టు13(విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో(Ibrahimpatnam Government College) నకిలీ పీజీ సర్టిఫికెట్లతో ఇద్దరు అధ్యాపకులు ఉద్యోగాలు పొందినట్లు అధికారులు గుర్తించారు. నిజామాబాద్ కు చెందిన సి.రవీందర్ 2011లో ఇబ్రహీంపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో (సిటి కన్స్ట్రక్షన్ టెక్నాలజీ - JL) కాంట్రాక్ట్ ఉద్యోగం కింద చేరాడు. 2023 మే నెలలో ఉద్యోగం పర్మినెంట్ అయ్యింది.

అదేవిదంగా నల్గొండ కు చెందిన ఆర్.సరిత ఎకనామిక్స్ - JL) గా 2023 లో ఇదే కళాశాలలో చేరి, విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ ఇబ్రహీంపట్నం జూనియర్ కాలేజీలో నకిలీ పీజీ సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు పొందినట్లు తేలడంతో స్థానికంగా చర్చనీయంశంగా మారింది . రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా ఉద్యోగాలు పొందిన 35 మంది జాబితాలో వీరి పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. తనిఖీల్లో నకిలీ సర్టిఫికెట్లు బయటపడటంతో ఇంటర్మీడియట్ బోర్డు సంబంధిత ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేదంటే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.