ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ముఖ్య అతిధిగా పాల్గొననున్న రాష్ట్ర శాసనసభ ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జయశంకర్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఆగస్టు 15న ఉదయం 9.30 గంటలకు స్థానిక క్రిష్ణకాలని అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని కలెక్టర్ వెల్లడించారు. ఈ వేడుకలలో ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర్య సమరయోధులు, అధికారులు, విద్యార్థులు, యువత, జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.






