సుర్జాపూర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సుర్జాపూర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైనారని ఆ పార్టీ మండల అధ్యక్షులు జంగిలి శంకర్ తెలిపారు. గురువారం గ్రామంలో జరిగిన ఎన్నికల కార్యక్రమానికి జంగిలి శంకర్ అధ్యక్షత వహించారు. గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా తునికి రవీందర్, ఉపాధ్యక్షులు పిట్టల రంజిత్, గంధం రాజు, యూత్ అధ్యక్షులుగా కాట ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి ఎండి ముషారఫ్, కోశాధికారిగా బిక్కి శ్రావణ్, ఎస్సీ సెల్ అధ్యక్షులుగా టేకులపల్లి రమేష్, బీసీ సెల్ అధ్యక్షులుగా బక్కశెట్టి శ్రీనివాస్, మైనార్టీ అధ్యక్షులు ఎస్.కె జావిద్, కార్యదర్శులు గురక రాజు ,కొమ్ము రవి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎస్కే దాదేమియా, బొమ్మన ప్రవీణ్ ,లు ఎన్నికైనట్లు తెలిపారు. కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ పథకాలను విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.






