23 March, 2026 | 2:11 AM

శరవేగంగా హైదరాబాద్ హైవే విస్తరణ

23-03-2026 12:00 AM
  1. మృత్యుపాశం నుంచి విముక్తి.. 

46 కిలోమీటర్ల మేర 4 టీములతో ఎన్హెచ్‌ఏఐ యుద్ధ ప్రాతిపదికన కసరత్తు

చేవెళ్ల, మార్చి 22 (విజయక్రాంతి):ఏళ్ల తరబడి సాగిన నిరీక్షణకు తెరపడింది. నిత్యం నెత్తురోడుతున్న హైదరాబాద్‌బీజాపూర్ జా తీయ రహదారి (NH-163) విస్తరణ పనులు ఇప్పుడు శరవేగంగా సాగుతున్నాయి. పోలీ స్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర జరుగుతున్న ఈ పనులను ఏడాదిన్నరలోగా పూర్తి చేయడమే లక్ష్యంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అడుగులు వేస్తోంది.

నాడు అడ్డంకులు.. నేడుపరుగులు

గతంలో మర్రిచెట్ల సంరక్షణ విషయంలో నెలకొన్న న్యాయపరమైన చిక్కులు ఈ ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకిగా మారాయి. అ యితే, రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ’సేవ్ బనియన్ ట్రీ’ సంస్థతో జరిపిన చర్చలు సఫలమ వ్వడం, ఎన్జీటీలో కేసు విత్డ్రా కావడంతో పనులకు లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతం మెగా ఇంజినీరింగ్ సంస్థ 10 కిలోమీటర్లకో టీమ్ చొప్పున 4 బ్యాచ్లుగా విడిపోయి, రెం డు షిఫ్టుల్లో పనులను పరుగులు పెట్టిస్తోంది.

రూ. 928 కోట్లతో అత్యాధునిక నిర్మాణం

విస్తరణ. ప్రస్తుతం ఉన్న 30 ఫీట్ల రోడ్డు ను 100 ఫీట్ల వెడల్పుతో 4 లేన్ల హైవేగా మారుస్తున్నారు.మొత్తం రూ. 928 కోట్లలో రూ. 786 కోట్లు నిర్మాణానికి, మిగిలినవి భూసేకరణకు కేటాయించారు.సెంట్రల్ డివైడర్, స్ట్రీట్ లైట్లు, పక్కా డ్రైనేజీ వ్యవస్థతో పా టు వర్షపు నీరు నిలవకుండా 30కి పైగా చి న్న బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు.గ్రామాల వద్ద ప్రజల సౌకర్యార్థం 18 అండర్ పాసుల నిర్మాణం చేపట్టారు.

మర్రిచెట్లకు ’పునర్జన్మ’.. పర్యావరణ హితంగా డిజైన్

పర్యావరణ ప్రేమికులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. రోడ్డు మధ్యలో మర్రిచెట్లు వచ్చేలా డిజైన్ మార్చారు. మొత్తం 900 చెట్లలో కేవలం 136 చెట్లను మాత్రమే వేర్లతో సహా తొలగించి శాస్త్రీయంగా రీ-ప్లాంటేషన్ చేస్తున్నారు. మిగిలిన చెట్లకు ఇరు వైపులా రోడ్డు నిర్మిస్తూ పచ్చదనాన్ని కాపాడుతున్నారు.

బైపాస్ రోడ్లతో ట్రాఫిక్ కష్టాలకు చెక్

మొయినాబాద్, చేవెళ్ల పట్టణాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా బైపాస్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

మొయినాబాద్ బైపాస్.......

భాస్కర్ ఆస్పత్రి నుంచి తాజ్ హోటల్ వరకు. చేవెళ్ల లో కేసారం నుంచి ఇబ్రహీంపల్లి వరకు బై పాస్ పనులు కొనసాగనున్నా యి. ఇక్కడ అండర్ పాసులు, బీటీ పనులు ఇప్పటికే చివరి దశకు చేరుకున్నాయి.మిషన్ భగీరథపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.రోడ్డు పక్కన ఉన్న మిషన్ భగీరథ పైప్లైన్లను ముందుగా పక్కకు షిఫ్ట్ చేస్తున్నారు. తద్వారా పనుల వల్ల గ్రామాలకు తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కల్వర్టుల నిర్మాణం ఇప్పటికే 80 శాతం పూర్తయింది.

సకాలంలో పనులు పూర్తవుతుందా?

పనులు వేగంగా సాగుతున్నప్పటికీ, వర్షాకాలం సమీపిస్తుండటం కొంత ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య అసెంబ్లీలో కోరినట్లు మల్కాపూర్, ఆలూర్ స్టేజీల వద్ద కొత్తగా అండర్ పాసులు నిర్మించాల్సి వస్తే, డిజైన్ మార్పుల వల్ల పనులు కొంత ఆలస్యం కావచ్చని అంచనా. ఏదేమైనా, 21 బ్లాక్ స్పాట్లతో మృత్యుఘంటికలు మోగించిన ఈ రోడ్డు త్వరలోనే సురక్షిత ప్రయాణానికి వేదిక కానుంది.