2 September, 2026 | 11:26 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

ఫిర్యాదుల పరిష్కారానికి చొరవ చూపాలి

07-07-2026 | 12:00am

కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి, జూలై 6: ప్రజావాణి కార్యక్రమంలో అందుతున్న ప్రతి ఫిర్యాదును అధికారులు సత్వరంగా, పారదర్శకంగా పరిష్కరించడానికి చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు సంగీత, పాండులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి వివరాలను తెలుసుకుని సంబంధిత శాఖల జిల్లా అధికారులకు వినతులను అందజేసి తగిన సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో డివిజన్ వారీగా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల్లో మొత్తం 66 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా  అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.