ప్రముఖ పారిశ్రామికవేత్త గుండె పోటుతో మృతి
కామారెడ్డి జిల్లాలో విషాదం
బీడీ కంపెనీ ప్రోప్రైటర్ తో పాటు ఆధ్యాత్మికవేత్త
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీలో నివాసం ఉంటు న్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఆధ్యాత్మికవేత్త చాట్ల శ్రీశైలం(67) ఆదివారం తెల్లవారు జామున మూడు గంటలకు కన్నుమూశారు. గత కొంతకాలం గా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తాడ్వాయి శబరిమాతకు శిష్యునిగా ఎన్నో ఆధ్యాత్మిక సేవలు అందించారు. చాట్ల నర్సయ్య కంపెనీ ప్రొప్రైటర్ గా శ్రీశైలం వ్యవహరిస్తున్నారు.
ఎన్నో గుడులకు దాన ధర్మాలు చేశారు. కామారెడ్డి ప్రాంతంలో లక్షలాదిమంది బీడీ కార్మికులకు ఉపాధి కల్పించిన ప్రముఖ పారిశ్రామికవేత్త చాట్ల శ్రీశైలం మృతి కామారెడ్డి ప్రాంతానికి తీరనిలోటు అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయన్నారు. తనకు ఎంతో ఆప్తునిగా ఉండిన శ్రీశైలం మృతి చెందడం హలో తీవ్రంగా కలిసి వేసిందని అని అన్నారు.
ఆయన కుటుంబ సభ్యుల కు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కామారెడ్డి ప్రాంతంలో చాట్ల శ్రీశైలం అంటే తెలియని వారు ఉండరు. వాణి నవశక్తి బీడీ కంపెనీ నెలకొల్ పి లక్షలాదిమందికి ఉపాధిని చూపిన మార్గదర్శకుడు చాట్ల శ్రీశైలం మృతి చెందటం కామారెడ్డి ప్రాంతానికి తీరని లోటు. శ్రీశైలంకు భార్య, కుమారుడు చాట్ల శివకుమార్ వైద్యునిగా సేవలందిస్తున్నారు, కుమార్తె ఉన్నారు.




