పునరుద్ధరించిన శాసనమండలి భవనం ప్రారంభం
హైదరాబాద్: నాంపల్లిలోని శాసనసభ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్ని(Renovated Legislative Council Building) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదివారం ప్రారంభించారు. కొత్తగా ముస్తాబైన వారసత్వ సంపదకు చిహ్నమైన తెలంగాణ పాత అసెంబ్లీ హాలు(Telangana Old Assembly Hall)ను సీఎం ప్రారంభించారు. అనంతరం భవనంలో ప్రవేశించి సీఎం రేవంత్ రెడ్డి, మండలి ఛైర్మెన్ సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డ ప్రసాద్ ముగ్గురు ఒకే కూర్చొని భవనాన్ని పరిశీలించారు. ఈ పునరుద్ధరించిన భవనాన్ని శాసనమండలి సమావేశాల కోసం ఉపయోగించనున్నట్లు సమాచారం. శాసనమండలి ఛైర్మెన్ సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.




