22 August, 2026 | 1:38 PM

మద్యం మత్తులో కత్తులతో బెదిరించిన వ్యక్తులు అరెస్ట్

22-08-2026 12:49 PM

 కొత్తగూడెం ఆగస్టు 22 విజయక్రాంతి:  కొత్తగూడెం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని, గణేష్ బార్‌లో ఇటీవల మద్యం మత్తులో కత్తులతో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులపై బైండొవర్ కేసులు, నమోదు చేసి నిందితులను కోర్టుకు తరలించారు. ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులపై చట్టప్రకారం, కేసులు నమోదు చేయడం జరిగిందని, దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి, పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా  నిర్ణయం తీసుకుంటారని, ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, చర్యలు తీసుకోవడం జరుగుతుందని, 3వ పట్టణ SHO ఇంద్రసేన రెడ్డి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసారు