బాలల రక్షణ పై ఉపాధ్యాయులకు శిక్షణ
మహబూబాబాద్ (విజయక్రాంతి): జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ (లీగల్ సర్వీసెస్) ఆధ్వర్యంలో బాలల రక్షణ అంశంపై అధికారులు, ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం మహబూబాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి కే.మురళీమోహన్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, ఎస్పీ డాక్టర్ శబరిష్ పాల్గొన్నారు. ఉదయం నుండి ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం ఐదు వరకు కొనసాగనుంది. బాలల రక్షణ వివిధ అంశాలపై జిల్లాలోని122 ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి, సెక్రెటరీ డిస్టిక్ లీగల్ సెల్ అథారిటీ జడ్జీ శాలిని షాకేలి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కృష్ణ తేజ్, డిస్టిక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.






