22 August, 2026 | 1:39 PM

రేషన్ బియ్యం పట్టివేత..రెండు వాహనాలు సీజ్

22-08-2026 01:22 PM

 బెజ్జూర్ ఆగస్ట్ 22 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని పాపన్ పేట్, మంచిర్యాల నుండి వచ్చిన ఓ వాహనం మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై సర్తాజ్ తెలిపారు. ఉదయం ఐదు గంటలకు విశ్వసనీయ సమాచారం మెరకు పోలీస్ సిబ్బందితో  మొగవెల్లి, సోమని మధ్యలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అక్కడ అనుమానాస్పదంగా వెళ్తున్న రెండు ఆటోలను ఆపి తనికి చేయగా అందులో ప్రభుత్వ రాహితీ బియ్యం ను అక్రమంగా తర్తిలిస్తున్న రెండు వాహనాలను పెట్టుకోవడం జరిగిందనీ తెలిపారు.వివరాల్లో కి వెళ్తే దొరికిన రెండు వాహనాలలో ఒకటి తూర్పతి దుర్గయ్య మంచిర్యాల కి చెందిన ఫోర్ వీలర్ ట్రాలీ ఆటో నం TG 19 T 3298  దాంట్లో 4 క్వింటాళ్ల  ప్రభుత్వం రాహితీ బియ్యం ను  దొరికిన రెండవ వాహనం ఒక్క యజమాని కెమెరా. కోటేష్  పాపన్ పేట్ , కి చెందిన త్రీ వీలర్ ఆటోలో ఎనిమిది క్వింటాళ్ల  పిడిఎఫ్ బియ్యం పట్టుకోనీ వారిని  పోలీసు  స్టేషన్ కి పట్టుకుని రావడం జరిగిందని తెలిపారు. వారి ఇద్దరిపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.