22 August, 2026 | 2:12 PM

పురిటి నొప్పులు వస్తే..! శిశువు ప్రాణం తీశారు

22-08-2026 01:36 PM

వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందారని బంధువుల ఆందోళన 

కామారెడ్డి, ఆగస్టు 22 (విజయక్రాంతి): కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు శనివారం మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఏక్కపల్లి తండాకు చెందిన సరిచoదుకు తాడ్వాయి మండలం నందివాడ చెందిన  స్వరూపకు 15 నెలల క్రితం వివాహం జరిగింది. స్వరూప గర్భం దాల్చడంతో పురిటి నొప్పులు వస్తున్నాయని శుక్రవారం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. నొప్పులు ఎక్కువగా ఉండడంతో ఆస్పత్రి వైద్యులకు శస్త్ర చికిత్స చేయాలని స్వరూప బంధువులకు సూచించారు. వైద్యులు మాత్రం శస్త్ర  చికిత్స చేయడం వద్దని కొద్దిసేపు చూద్దామని సాధారణ డెలివరీ అవుతుందని తెలిపారు.

వైద్యుల నిర్లక్ష్యం వల్లే నవజాత శిశు మృతి చెందినట్లు బాధితురాలు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆస్పత్రి వైద్యులు మాత్రం డెలివరీ కోసం వచ్చిన మహిళకు రక్తహీనత ఉందని, అత్యవసరంగా రక్తం కూడా ఎక్కించడం జరిగిందని ఆసుపత్రి సూపర్డెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం లేదని మహిళకు రక్తం తక్కువ ఉండడం వల్లే ఇబ్బందులు ఏర్పడినట్లు తెలిపారు. మహిళకు శస్త్ర చికిత్స చేసి బాబును బయటకు తీసేందుకు ప్రయత్నించగా మృతి చెందినట్లు తెలిపారు. ఆస్పత్రి ఎదుట మహిళా బంధువులు ఆందోళన కు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. వైద్యులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆసుపత్రి వద్దకు బలగాలు చేరుకొని బందోబస్తు నిర్వహించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో మహిళ బంధువులు ఆందోళన విరమించారు.