2 March, 2026 | 10:44 AM

దళారుల ప్రమేయం లేకుండా ఇందిరమ్మ బిల్లులు

02-03-2026 02:12 AM

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మపురి, మార్చి 1 (విజయ క్రాంతి): దళారుల ప్రమేయం లేకుండానే ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లులు చెల్లిస్తున్నామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారం మండలం గోపాల్ పేట గ్రామంలో తాండ్ర రజిత-గంగయ్యలకు మం జూరైన ఇందిరమ్మ ఇంటిని మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రజా ప్ర భుత్వం అర్హులైన పేదలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందిస్తుందని అన్నారు.

గోపాల్ పేట గ్రామంలో 24 ఇండ్లు మం జూరు చేయగా ఏడు ఇల్లు నిర్మాణం పూర్తి కావడానికి వచ్చాయని, మిగిలిన వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని, దళారులు, మధ్య వర్తుల ప్రమేయం లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తుందని తెలిపారు. మార్చి నెలలో మరో 2 వేల ఇంది రమ్మ ఇళ్లు నియోజకవర్గానికి మంజూరు అవుతాయని, అర్హత ఉన్న ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని మంత్రి తెలిపారు. 

వార్షికోత్సవంలో పాల్గొన్న మంత్రి..

గోపాల్ పేట గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 20వ వార్షికోత్సవంలో మం త్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, ఆలయ పూజారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి 10 లక్షలు నిధులు అందజేస్తామని మంత్రి ప్రకటించారు. గ్రామంలో పద్మశాలి సేవా సంఘం నూతన భవనానికి 5 లక్షలు,

ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు 5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. గ్రామంలోని మహిళా సంఘాలకు గోదాం నిర్మా ణం కొరకు స్థల సేకరణ చేయాలని ధర్మా రం తాహసీల్దార్ ను మంత్రి ఆదేశించారు. గోపాల్ పేటకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు దూడ నర్సయ్య భార్య దూడ నర్సమ్మ ఇటీవల మరణించగా మంత్రి లక్ష్మణ్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.