పంద్రాగస్టు కానుకగా భారత్ భాగ్య విధాత
కంగనా రనౌత్, గిరిజ ఓక్, స్మిత తాంబే తదితరులు నటించిన చిత్రం ‘భారత్ భాగ్య విధాత’. మనోజ్ తపడియా రచన, దర్శకత్వంలో పెన్ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్, పరమహంస్ క్రియేషన్స్, యూనోయా ఫిలమ్స్ ఎల్‌ఎల్‌పీ, ఫ్లోటింగ్ రాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో నిర్మించారు. భారతదేశ చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయాన్ని ఈ చిత్రం తిరిగి గుర్తు చేస్తుంది. తమ ధైర్యసాహసాలు, నిస్వార్థతతో లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడిన ఒక వీరుల బృందాన్ని ఈ చిత్రం వెలుగులోకి తీసుకుస్తుంది.
ఈ సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న ప్రత్యేక డిజిటల్ ప్రీమియర్‌తో హిందీ జీ 5లో స్ట్రీమింగ్‌కు వస్తోంది. ఈ సందర్భంగా జీ 5 హిందీ బిజినెస్ హెడ్, టీవీ చీఫ్ ఛానల్ ఆఫీసర్ కావేరి దాస్ మాట్లాడుతూ.. “ప్రతి శక్తివంతమైన కథకు మూలం దానిని విభిన్నంగా చెప్పే ధైర్యమే. ‘భారత్ భాగ్య విధాత’ ఆ స్ఫూర్తికి ప్రతిరూపం. ఈ స్ఫూర్తిదాయకమైన కథను ప్రేక్షకులకు అందించడం మాకు గర్వకారణం” అన్నారు.






