3 July, 2026 | 11:21 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

అమ్మకానికి లక్నో సూపర్ జెయింట్స్

13-03-2026 12:00 AM

ముంబై, మార్చి 12: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కీలక పరిణామం దిశగా అడుగులు పడుతున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్‌లో 15 శా తం వాటాను విక్రయించాలని ఆర్పీ-ఎస్జీ గ్రూప్ భావిస్తున్నది. ఓ వైపు ఆర్సీబీ అమ్మకం ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే ఈ వార్తలు రావడం హాట్ టాపిక్‌గా మారింది.

ఐపీఎల్ 2025 సీజన్‌లో జట్టు ఎదుర్కొన్న ఇబ్బందుల తరువా త సంజీవ్ గోయెం కా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తుది నిర్ణయం పెట్టుబడిదారులు అందించే వాల్యుయేషన్‌పై ఆధారపడి ఉంటుందని, ఆఫర్లు ఆకర్షణీయంగా లేకుంటే వెనక్కి తగ్గవచ్చునని భావిస్తున్నారు.