కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం
12-06-2026 01:34 PM
కూసుమంచి,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి(శివాలయం) దేవస్థానంలో శుక్రవారం హుండీ లెక్కింపు చేయగా మంచి ఆదాయం లభించింది. దేవస్థానం హుండీ నందు ఆదాయం 65,860 ఆదాయం వచ్చింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం సహాయ కమిషనర్ కార్యాలయం నుండి సీనియర్ అసిస్టెంట్ బెల్ సింగ్, కార్య నిర్వహణ అధికారి కాముని శ్రీకాంత్, సత్యసాయి ట్రస్ట్ సభ్యులు చోడవరపు రమేష్, అర్చకులు దేవరపల్లి శేషగిరి శర్మగారు, బాలాజీ, అభిరామ్, జూనియర్ అసిస్టెంట్ రాందాస్, గ్రామ ప్రజలు రేల ప్రదీప్ రెడ్డి, చెన్నూ రవి, ఉపసర్పంచ్ చెన్ను వెంకటరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు.






