13 June, 2026 | 4:32 AM

కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి

12-06-2026 01:32 PM

కూసుమంచి,(విజయక్రాంతి):  కూసుమంచి సర్పంచ్ దంపుతుల పెళ్లిరోజు సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ప్రజాసేవలో ముందుండి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న ఈ దంపతులు మరిన్ని విజయాలు సాధించి ప్రజల ఆదరణను పొందాలని మంత్రి ఆకాంక్షించారు. మీ ఇద్దరి దాంపత్య జీవితం ఆనందం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో నిండిపోవాలని కోరుకుంటూ మంత్రి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు..