2 August, 2026 | 3:13 AM

పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచండి

02-08-2026 12:13 AM
  1. లాంగ్ జంప్‌ను 3.80 మీటర్లకు కుదించాలి
  2. సీఎస్‌కు నిరుద్యోగ జేఏసీ వినతి

హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాం తి): పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వయోపరిమితిని మానవతాదృక్పథంతో మరో రెండేళ్లకు పెంచాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మూల విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ సంజయ్ జాజును శ్రీధర్ రెడ్డి, నాయకులు చంద్రశేఖర్ చేపూరి కలి సి వినతిపత్రం సమర్పించారు.

లాంగ్ జంప్‌ని 4 మీటర్ల నుంచి ఇంతకు ముం దు ఉన్న తరహాలోనే 3.80 మీటర్లకు కు దించాలని కోరారు. పోటీ తీవ్రత దృష్ట్యా భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలను సప్లమెంటరీ నోటిఫికేషన్ ద్వారా ప్రస్తుత పోలీస్ నోటిఫికేషన్‌కు జత చేయాలన్నారు. గ్రూ ప్-1, 2 నోటిఫికేషన్లను కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకువచ్చిన జీవో నెం.46 ద్వారా రాజ్యాంగంలోని సమానత్వపు హక్కు అయినా 14కు తీవ్ర విఘాతం కలగడమే కాకుండా మెరిట్ అభ్యర్థులకు నష్టం జరుగుతుందన్నారు.

ఈ జీవో కేవ లం పోలీస్ నోటిఫికేషన్‌కు మాత్రమే పరిమితం కాకుండా జోనల్ ప్రాతిపదికన నియామకమయ్యే గ్రూప్ 2, 3, 4, సీడీపీవో, ఈవో తదితర అన్ని నియామకాలలో తీవ్ర ప్రభావం చూపుతుంద న్నా రు. ఈ జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని అంశాలపై సీఎన్ సానుకూలంగా స్పందించారని శ్రీధర్‌రెడ్డి తెలిపారు.