19 March, 2026 | 12:42 AM

బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు తగవు

18-03-2026 12:00 AM
  1. తుంగతుర్తి ఎమ్మెల్యే తీరును ఖండించిన వనపర్తి జిల్లా ధూపదీప నైవేద్య అర్చకులు

అర్చక సంఘం జిల్లా అధ్యక్షులు పీ.వీ. లక్ష్మీకాంత ఆచార్యులు

శ్రీరంగాపూర్, మార్చి 17:తుంగతుర్తి శాసనసభ్యుడు బ్రాహ్మణ సమాజాన్ని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వనపర్తి జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘం జిల్లా అధ్యక్షులు పీ. వీ. లక్ష్మీకాంత ఆచార్యులు తెలిపారు. ప్రజాప్రతినిధి హోదాలో ఉన్న వ్యక్తి ఒక సామాజిక వర్గాన్ని అవమానించే విధంగా మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు.

మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో అర్చక సంఘం ప్రతినిధులు ఈ విష యాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. లోకకళ్యాణం కోసం, సమాజ శ్రేయస్సు కోసం ని రంతరం దేవాలయాల్లో దైవ సేవలో నిమగ్నమై ఉండే బ్రాహ్మణులను మరియు అర్చ కులను రాజకీయాల్లోకి లాగడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. శాసనసభ్యుడి వ్యాఖ్యలు బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీశాయని, వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని అర్చక సంఘం డిమాండ్ చేసింది.

ప్ర జలందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు కులమతాలకు అతీతంగా వ్యవహ రించాల్సిన బాధ్యత ఉందని, కానీ ఓట్ల రాజకీయాల కోసం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసు కుని మాట్లాడటం దురదృష్టకరమని సం ఘం నాయకులు మండిపడ్డారు. భవిష్యత్తు లో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే రా ష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్చక సమాజం ఏకమై ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లాలోని వివి ధ మండలాల నుంచి వచ్చిన అర్చకులు, సంఘం బాధ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.