ఈ వారం వార్తల్లో..
మేరు నగ ధీర ‘నిర్మల్’..
అతడు క్షేత్రస్థాయిలో సైనికుడు.. నావికుడు.. చేతికి ఎముక లేని దాత.. పర్వతారోహకుడు.. అతనే నేపాల్‌కు చెందిన నిర్మల్ పుర్జా. అతనిపై 14 పర్వతాలను అధిరోహించిన రికార్డులు ఉన్నాయి. ఒక్కో పర్వతం ఎత్తు 8,౦౦౦ మీటర్ల ఎత్తు. అంటే.. నిట్టనిలువునా ఎనిమిది కిలోమీటర్ల పొడవు. వాటిని అధిరోహించిన ఒక ధీశాలిని ఇటీవల ఒక్క మంచు తుఫాను పొట్టన పెట్టుకోగలిగింది.
ఆగిన జమునా వాహిని
ఒక ఉజ్వల గాన ధార శాశ్వతంగా ఆగిపోయింది. నేపథ్య గాయని జమునారాణి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆమె నిష్ర్కమణతో దక్షిణాది సంగీత సామ్రాజ్యంలో ఒక అద్భుతమైన గాన శకం ముగిసినట్లయింది. ఆమె స్వరం ఎంతటి క్లిష్టమైన పాటకైనా జీవం పోసేది. శ్రోతలను మంత్రముగ్ధులను చేసే శ్రావ్యత ఆమె గాత్రం ప్రత్యేకత. మన మధ్య లేకపోయినా ఆమె పాటలు మాత్రం అజరామరం.






