2 August, 2026 | 3:28 AM

కనుమరుగవుతున్న ఎడ్ల బండి!

02-08-2026 12:00 AM

మహబూబాబాద్, విజయక్రాంతి: కొంతకాలం క్రితం వరకు వ్యవసాయంలో ఎడ్ల బండ్లకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ప్రతి రైతు ఇంట్లో తప్పనిసరిగా ఒక జత ఎడ్లు, ఎడ్ల బండి ఉంటేనే వ్యవసాయం ముందుకు సాగేది. కాలక్రమేనా ఆధునిక వ్యవసాయ పనిముట్లు అందుబాటులోకి రావడం, ట్రాక్టర్లు, ఇతర యంత్రాల వినియోగం పెరిగిపోవడం, అడవులు అంతరించిపోవడంతో కర్రకు తీవ్ర కొరత ఏర్పడింది.

ఈ క్రమంలో కర్రకు బదులు ప్రత్యామ్నాయంగా ఇనుప పనిముట్లు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో అటు పశుపోషణ కష్టతరం కావడం, ఇటు కర్రకు డిమాండ్ ఏర్పడటంతో ఎడ్ల బండ్ల వినియోగాన్ని పూర్తిగా తగ్గించారు. ఈ నేపథ్యంలో ఎడ్ల బండ్లు ఇప్పుడు ఆనాటి ‘గుర్తు’గా కనిపిస్తున్నాయి. 

 బండి సంపత్‌కుమార్