ఈ వారం వార్తల్లో..
మూగబోయిన పాట
దిగ్గజ నేపధ్య గాయని, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత సుమన్ కల్యాణిపుర్(89) ముంబయిలో కన్నుమూశారు. ఢాకాలో 1937లో పుట్టారు. 1954 నుంచి 1988 వరకు మూడు దశాబ్దాల పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో వందలాది పాటలు పాడారు. వ్యాపారవేత్త రామానంద్ కల్యాణ్ పుర్‌తో వివాహమయ్యాక ఆమె సుమన్ కల్యాణ్ పుర్ అయ్యారు. 1954లో వచ్చిన మంగు చిత్ర గీతంతో గాయనిగా మారారు.
దీదీకి రితబ్రత సవాల్
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ.. 59 మంది రెబెల్ ఎమ్మెల్యేలతో గ్రూపుగా ఏర్పడి, మమతా బెనర్జీ నాయకత్వానికి సవాల్ విసిరారు. గెలిచిన 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేల లో 59 మంది మద్దతును రితబ్రత కూడగట్టి.. ఆయన్నే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోరుతూ స్వీకర్‌కు లేఖలను సమర్పించారు. దీదీ మేనల్లుడు అభిషేక్ పెత్తనం భరించలేకే తిరుగుబాటు అని అసంతృప్త నేతలు అంటున్నారు.






