1 July, 2026 | 7:49 PM

Breaking News

బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •  

నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్

17-04-2026 12:20 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలో నకిలీ పత్తి విత్తనాలను అక్రమంగా రవాణా చేస్తున్న గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో రూ.16.25 లక్షల విలువైన సుమారు 6.5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15న మధ్యాహ్నం ఆసిఫాబాద్ మండలంలో నకిలీ పత్తి విత్తనాల రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్.ఐ బొజ్జిరావు ఆధ్వర్యం లో గుండి క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఏపీ 01ఎన్ 1500 నంబర్ గల కారును ఆపి తనిఖీ చేయగా, రెండు హెచ్డీపీఈ సంచుల్లో 80 కిలోల Glycel BT నకిలీ పత్తి విత్తనాలు గుర్తించారు. విచారణలో నిందితుడు రాచర్ల మహేష్  విత్తనాలను గుజరాత్కు చెందిన అంకిత్ నుండి కొనుగోలు చేసి రైతులకు విక్రయించేందు కు తరలిస్తున్నట్లు తెలిపారు. విచారణలో రాచర్ల మహేష్ ఇచ్చిన సమాచారం మేరకు తాండూరలోని అతని గోదాములో పోలీసులు సోదాలు నిర్వహించగా, 14 హెచ్డీపీఈ సంచులు, 3 గన్నీ సంచుల్లో సుమారు 5.7 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం స్వాధీనం చేసిన విత్తనాల విలువ సుమారు రూ.16.25 లక్షలు గా అంచనా వేస్తున్నారు.మండల వ్యవసాయ అధికారి మిళింద్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి రాచర్ల మహేష్, సాయి కిరణ్లను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు ఎస్హెచ్‌ఓ పి. బాలాజీ వర ప్రసాద్ తెలిపారు.