100% గిరిజనులు ఉన్న గ్రామాలకు పిఎం జిఎస్వై పథకాన్ని అమలు చేయండి
బోథ్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో 100% గిరిజనులు ఉన్న గ్రామాలకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద రోడ్డు సౌకర్యం కల్పించాలని అందుకు నిధులు మంజూరు చేయాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదిలాబాద్ ఎంపీ జీ నగేష్ కలవడం జరిగింది. ఎంపీ విన్నపం మేరకు సానుకూలంగా మంత్రి స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు.
కేంద్ర మంత్రిని కలిసిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సహచర పార్లమెంటు సభ్యులు డీకే అరుణ ఈటెల రాజేందర్ రఘునందన్ రావు కొండ విశ్వేశ్వర్ రెడ్డిలు ఉన్నారు. కాగా ఆదిలాబాద్ ఎంపీ అదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ కు రైల్వే లైన్ ఏర్పాటు విషయమై సహచర ఎంపీలతో కలిసి కేంద్రమంత్రికి విన్నవించడం జరిగింది. ఏది ఏమైనా జిల్లా అభివృద్ధి కోసం రెండు రోజుల నుండి ఎంపీ సహచర ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు.






