కేంద్ర మంత్రి కుమారునిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి
11-05-2026 02:47 PM
బోథ్,(విజయక్రాంతి): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారునిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం బోత్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. స్థానిక శాసనసభ్యుల ఆదేశానుసారం ఫిర్యాదు చేస్తున్నట్లు బి ఆర్ ఎస్ నాయకులు తెలిపారు. మంత్రి కుమారుని పైన ఫోక్సో కేసు నమోదు అయినందున తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు అల్లకొండ ప్రశాంత్, యూత్ అధ్యక్షులు ప్రవీణ్, మండల కార్యదర్శి ఎల్కరాజు, సర్పంచుల సంఘం అధ్యక్షులు ఓరుగంటి స్వామి ,మాజీ అధ్యక్షుడు బండారు శ్రీధర్ రెడ్డి ,గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ రమణ గౌడ్, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, దివాకర్ రెడ్డి, రాజు రెడ్డి ,రమేష్ తదితరులు పాల్గొన్నారు.






