11 May, 2026 | 4:20 PM

రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు

11-05-2026 02:49 PM

వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మండలం లంజన్ వీర గ్రామంలో సోమవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జంబుల్ ధరి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ పవన్ కుమార్, వాంకిడి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డాక్టర్ సౌజన్య మాట్లాడుతూ... రైతులకు పంటల సాగులో మెలకులవల పై అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయం, భూసార పరీక్షలు, పంటల మార్పిడి, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగు తదితర అంశాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జంబులు దారి ఉప సర్పంచ్ గుర్నులే విఠల్,ఏఈవో, రైతులు తదితరులు పాల్గొన్నారు.