అక్రమంగా డంపు చేసిన ఇసుక సీజ్
27-05-2026 01:19 AM
విజయక్రాంతికి స్పందన
నాగిరెడ్డిపేట్, మే 26 (విజయక్రాంతి): మండలంలోని మంజీరా పరిసర ప్రాంతాలలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ డప్పు చేసిన ఇసుక కుప్పల గురించి విజయక్రాంతి దినపత్రికలో వచ్చిన కథనానికి స్థానిక ఆర్‌ఐ.మహేష్, ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ సంఘటన స్థలానికి వెళ్లి డంపు చేసిన ఇసుక కుప్పలను సీజ్ చేసినట్లు తెలిపారు. మండలంలో అక్రమంగా ఇసుక రవాణా ఎవరైనా తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.






