అక్రమ కలప రవాణా.. ట్రాక్టర్ పట్టివేత
బిజినేపల్లి మే 3 మండలంలోని గంగారం గ్రామంలో చెట్లను నరికి ట్రాక్టరుపై అక్రమంగా తరలిస్తుండగా, స్థానిక పోలీసులు ఆదివారం సాయంత్రం మంగనూర్ గ్రామ శివారు పట్టుకొని బిజినేపల్లి పోలీస్ స్టేషనుకు తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గంగారం గ్రామంలో చెట్లను నరికి వాటిని ట్రాక్టారుపై టార్పాలినుతో కప్పి అక్రమంగా తరలిస్తున్నారు.
మంగనూరు గ్రామ శివారులో వెలికిచెర్ల వైపు వెళ్తున్న ట్రాక్టారును పోలీసులు ఆపి తనిఖీ చేశారు. కలప రవాణాకు చెందిన అనుమతులు అడిగారు. అలాంటి అనుమతులు తీసుకోకుండానే వారు అక్రమంగా తరలిస్తుండటంతో పోలీస్ స్టేషనుకు తరలించారు. గంగారం గ్రామం నుండి ప్రతి రోజూ అక్రమంగా కలపను తరలిస్తునా పట్టించుకునే వారు లేరని, అటవీశాఖ అధికారులు పూర్తి నీర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.






