4 May, 2026 | 4:18 AM

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

04-05-2026 02:59 AM

ఇద్దరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు

నాగర్ కర్నూలు మే 3 విజయక్రాంతినాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామ సమీపంలోని శ్రీశైలంహైదరాబాద్ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.స్థానికుల వివరాల ప్రకారం, శ్రీశైలం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న కారు అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది.ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సులోని అద్దాలు పగిలి కిందపడగా, ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

బస్సులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి కూడా మృతి చెందినట్లు సమాచారం. కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.