26 April, 2026 | 10:30 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

ఇందిరమ్మ ఇళ్ల పేరిట అక్రమ ఇసుక దందా..?

02-12-2025 07:52 PM

కొల్చారం (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల పేరిట అక్రమ ఇసుక దందా జోరుగా సాగుతుంది. ఒక్క ట్రాక్టర్ తో అనుమతి తీసుకొని ఇష్టానుసారంగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి మంజీరా నది నుండి అక్రమ ఇసుక దందా జోరుగా సాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నుండి ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఒక ట్రాక్టర్ కు అనుమతి తీసుకొని 5, 6 ట్రాక్టర్లు అదనంగా ఏర్పాటు చేసుకొని ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు అక్రమ ఇసుక దందాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.