21 July, 2026 | 12:23 PM

అక్రమ వెంచర్లు @ బాన్సువాడ

21-07-2026 12:00 AM
  1. విచ్చల విడిగా వెలుస్తున్న అక్రమ వెంచర్లు నిబంధనలకు పాతర 
  2. రాబోయే రోజుల్లో అవస్థలు పడనున్న కొనుగోలు దారులు
  3. ఖాళీ జాగా కనిపిస్తే చాలు వెంచర్ గా డెవలప్ మెంట్
  4. కన్నెత్తి చూడని సంబంధిత శాఖ ఉన్నతాధికారులు

బాన్సువాడ, జూలై 20 (విజయ క్రాంతి): అక్రమ వెంచర్లకు కేరాఫ్ గా బాన్సువాడ నిలుస్తుంది. వెంచర్ల కు ఉన్న నిబంధనలు తుంగలో తొక్కి దర్జాగా వెంచర్లు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్మకాలు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ అక్రమ వెంచర్లకు కేరాఫ్ గా మారుతుంది.నిబంధనలకు పాతర వేస్తూ, ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా ఇస్టారితీన  అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లాగా వెలుస్తున్నాయి. దీనికి కొందరు బడా బాబులు పరోక్షంగా మద్దతు తెలుపుతూ ఉండడంతో అక్రమార్కులు ఇష్టానుసారంగా, ఎక్కడపడితే అక్కడ ఖాళీ జాగా కనిపిస్తే చాలు వెంచర్లను వేస్తూ, సామాన్యులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు,  రాబోయే రోజుల్లో ఇబ్బందులను పట్టించుకోకుండా వెంచర్లను వేస్తున్నారు.

వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయాలు

దర్జాగా ఎలాంటి అనుమతులు లేకుండా, వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయాలు చేపడుతున్నారు.కొన్నిచోట్ల నాలా కన్వర్షన్లు కూడా లేకుండా  ఇష్టానుసారంగా ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు చేస్తున్నారు. బాన్సువాడ పట్టణం మున్సిపాలిటీగా మారడంతో ప్లాట్లకు ఉన్న డిమాండ్ ను ఆసరా చేసుకొని, రాబోయే రోజుల్లో ప్లాట్లు కొనుగోలు చేసుకుని ఇల్లు నిర్మించే వారికి ఇబ్బందులను పక్కనపెట్టి, తమ దందా కొనసాగుతే చాలు నియమ, నిబంధనలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా కొనసాగిస్తున్నారు.

ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు మాత్రం ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవు తున్నాయి.బాన్సువాడ మండలం లోని వెంచర్లలో ఎన్ని ఫీట్ల రహదారులు ఉండాలి, వ్యవసాయానికి పనికిరాదు అని భూమిని వెంచర్గా చేసేందుకు నాలా కన్వెన్షన్ చేసే అధికారులు సైతం ఇవేమీ పట్టించుకోకుండా కొందరికి అనుమతులు ఇవ్వడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 10 శాతం భూమి గ్రామపంచాయతీ పరిధిలో ఉంటే గ్రామపంచాయతీకి, పట్టణ పరిధిలో ఉంటే మున్సిపాలిటీకి కేటాయించాల్సి ఉంటుంది.

దీనికి తోడు 15 శాతం భూమిని మార్డ్ గేజ్ చేయాల్సి ఉంటుంది. విద్యుత్ స్తంభాలు, నీటి సదుపాయం, పార్కు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తదితర అన్ని రకాలుగా నియమ నిబంధనలు పాటించి వెంచర్లు వేయాల్సి ఉండగా ఇవేమీ లేకుండా, ఫైనల్ లేఅవుట్ లేకుండానే దర్జాగా ప్లాట్లను విక్రయిస్తుండడం గమనార్హం. 

అనుమతి లేని వెంచర్లపై, కేవలం నాలా కన్వెన్షన్తో జరుపుతున్న రిజిస్ట్రేషన్ లపై, పట్టణం పరిసరాల్లో కొనసాగుతున్న తంతుపై పూర్తిస్థాయిలో కులం కుశంగా ప్రత్యేక బృందం ద్వారా విచారణ చేపట్టి అక్రమంగా వెలుస్తున్నా వెంచర్లపై, దానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.  రాబోయే రోజుల్లో సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని పట్టణవాసులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

వ్యవసాయ భూములు వెంచర్లగా ఏర్పాటు..

బాన్సువాడ పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములను రియల్ వ్యాపారులు ధనార్జనయ ధ్యేయంగా ప్రభుత్వానిబంధనలను తుంగలో తొక్కి వ్యవసాయ భూములను వెంచర్లుగా ఏర్పాటు చేస్తూ అమాయక ప్రజలను దండుకుంటున్న సంఘటనలు ఎన్నెన్నో ఉన్నాయి. 

ఖాళీ జాగా కనిపిస్తే చాలు వెంచర్ నిర్మాణాలు..

బాన్సువాడ పట్టణ ప్రాంతం తోపాటు పరిసర ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే చాలు అక్కడ ప్రభుత్వ భూమి అయినా అసైన్డ్ భూమి అయినా వెంచర్ ఏర్పాటు చేసి రియల్ వ్యాపారులు అక్రమాలకు తెర లేపు తున్నారు.

కన్నెత్తి చూడని సంబంధిత శాఖ అధికారులు..

బాన్సువాడ పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంతాలలో హిస్టారీతిన ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ వెంచర్లను ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఆ వైపు జిల్లా సంబంధిత శాఖ అధికారులు కన్నీటి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. 

అక్రమ వెంచర్లపై ఉక్కు పాదం

 త్వరలోనే ఏన్ ఫోర్స్ మెంట్ టీమ్ ను ఏర్పాటు చేస్తున్నామని అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్న వెంచర్లపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ గంగాధర్ తెలిపారు. ప్రజలు అనుమతులు ఉన్న వెంచర్ల లోనే కొనుగోలు చేయాలని అనుమతులు లేని వెంచర్ల కొనుగోలు చేసి మోసపోవద్దని ఆయన సూచించారు. డి టి సి పి ఉన్న వెంచర్లనే కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు.

- గంగాధర్, మున్సిపల్ కమిషనర్, బాన్సువాడ