21 July, 2026 | 5:59 PM

హైదరాబాద్‌లో భారీ వర్షం

21-07-2026 12:00 AM
  1. నేడు పలు జిల్లాల్లో వానలు
  2. వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ

హైదరాబాద్ జూలై 20 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో సోమవారం భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఆదిలాబాద్, కొమురం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జిగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు కురువనున్నాయి.

ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇక సోమవారం రాష్ట్రంలో ని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసఫ్‌గూడ, సనత్‌నగర్, కృష్ణానగర్, ఫిల్మ్‌నగర్, బోరబండ, ఎర్రగడ్డ, అమీర్‌పేట, పంజాగుట్ట, ముషీరాబాద్, చిక్కడపల్లి, సికింద్రాబాద్, బాగ్‌లింగంపల్లి, రామ్‌నగర్, జవహర్‌నగర్, గాంధీనగర్, కవాడిగూడ, భోలక్‌పూర్, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, తిలక్‌నగర్, బర్కత్‌పూరాతోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

అదేవిధంగా వనపర్తి, ములుగు, మహబూబ్‌నగర్, నారాయణ పేట్, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, కొమురంభీం, మంచిర్యాల, జగిత్యాల, వికారాబాద్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో సాధారణ స్థాయి నుంచి ఓ మోస్తారు వర్షం కురిసింది. ఇక మిగలిన జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి.