24-02-2026 01:30:54 AM
వేములవాడ, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): వేములవాడ పట్టణంలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భారీ మొత్తంలో అక్రమ మద్యం పట్టుబడింది. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దాడుల్లో శాస్త్రి నగర్కు చెందిన కోలా మారుతి అనే వ్యక్తి అక్రమంగా మద్యం నిల్వ ఉంచినట్లు పోలీసులు గుర్తించారు.
వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వీర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు దాడులు నిర్వహించగా వివిధ రకాల బ్రాండ్లకు చెందిన మొత్తం 120.4 లీటర్ల మద్యం సీసాలు, టిన్లు స్వాధీనం చేసుకున్నామని,స్వాధీనం చేసిన మద్యం విలువ సుమారు రూ. 54,589/- ఉంటుందని అధికారులు అంచనా వేశారు.అక్రమంగా మద్యం నిల్వ ఉంచినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని సర్కిల్ ఇన్స్పెక్టర్ వీర ప్రసాద్ హెచ్చరించారు. ఈ ఘటనపై నిందితుడిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు, అక్రమ మద్యం కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించాలని ఆయన కోరారు.