24-02-2026 01:32:50 AM
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని,జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని డిఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రతి రోజు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఇందులో భాగంగా గడిచిన 20 రోజులలో సబ్ డివిజన్ పరిధిలో 364 మoదిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటుగా కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఆ యొక్క లైసెన్స్ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫారసు చేయడం జరుగుతుందని, జిల్లాలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంతో పాటుగా,మద్యం సేవించి పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తూ ప్రజలలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొన్న పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ,ట్రాఫిక్ ఎస్.ఐ శ్రీకాంత్,సిబ్బంది పాల్గొన్నారు.