19 March, 2026 | 9:50 AM

డొమెస్టిక్ అక్రమ వినియోగం

19-03-2026 12:31 AM
  1. అధిక ధరలకు సిలిండర్లు సరఫరా...?

పక్క దారి పడుతున్నడొమెస్టిక్ సిలిండర్లు..

వాణిజ్య సిలిండర్లస్థానంలో గృహ సిలిండర్లు

బెజ్జంకి, మార్చి 18:గృహ అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన డొమెస్టిక్ సి లిండర్లు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు హో టళ్లలో అక్రమంగా వినియోగిస్తున్నరు. వాణి జ్య సిలిండర్ల స్థానంలో గృహ సిలిండర్లను ఉపయోగిస్తూ, వాటిని బయటకు కనిపించకుండా సంచుల్లో దాచిపెట్టి వాడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

కొన్ని హోటళ్లలో బయటకు కనిపించేలా కమర్షియల్ సిలిండర్ ఉంచి, లోపల మాత్రం గృహ (డొమె స్టిక్) సిలిండర్లనే వినియోగిస్తున్నట్లు వెల్లడవుతోంది. అధికారులు తనిఖీలు చేసినప్పు డు తప్పించుకోవడానికి ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇం టి అవసరాల కోసం ప్రభుత్వం సబ్సిడీపై అందించే డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపార అ వసరాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధం. అయినప్పటికీ, ఖర్చు తగ్గించుకునేందుకు కొంతమంది హోటల్ యజమా నులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారని సమాచారం.

డొమెస్టిక్ సిలిండర్ లు వాణిజ్య అవసరాలకు వినియోగించటం వల్ల కృత్రి మ కొరత ఏర్పడి పెద మధ్య తరగతి కుటుంబాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు .అంతర్జాతీయ మార్కెట్ లో గ్యాస్ దిగుమతి తగ్గి ధరలు పెరిగాయని నెపంతో కొన్ని గ్యాస్ సరఫరా సంస్థలు హోటళ్లకు అధిక ధరలకు సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా మా ర్కెట్లో గ్యాస్ ధరలు మరింత పెరిగి, బ్లాక్ మార్కెట్లో సిలిండర్ ధర రూ.1200 నుంచి రూ.1300 వరకు చేరినట్లు స్టానికుల నుంచిసమాచారం. మధ్యవర్తుల ద్వారా అక్రమ సరఫరా జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మండలంలోని పలు హోటళ్లలో ఈ దుర్వినియోగం బహిరంగ ర హస్యంగా మారినా, సంబంధిత అధికారు లు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.డొమెస్టిక్ సిలిండర్ లు వినియోగరులు పొందాలంటే బుకింగ్ డి ఎ సి, ఓ టీ పి, విధానం అని చెప్పే గాస్ ఏజెన్సీలు వాణిజ్య అవసరాలకు గృహ అవసర  సిలిండర్ లు ఏవిధంగా అందజేస్తున్నారని గృహ అవసర వినియోగదారులు వాపోతున్నారు. 

ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టి, గృహ సిలిండర్ల అక్రమ వినియోగం, అధిక ధరలకు గ్యాస్ సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

జిల్లాలో గ్యాస్ కొరత లేదు

జిల్లాలో  గ్యాస్ కొరత లేదని, గ్యాస్ సిలిండర్లు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని డీసీఎస్‌ఓ తెలిపారు . గృహ వినియోగానికి కేటాయించిన డొమెస్టిక్ గ్యాస్ను అధిక ధరలకు విక్రయించడం లేదా కమర్షియల్ అవసరాలకు మళ్లించడం చట్ట విరుద్ధమని హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 డీసీఎస్‌ఓ తనూజ