3 July, 2026 | 1:13 AM

శ్రీచైతన్యలో పుస్తకాల అక్రమ దందా

03-07-2026 12:25 AM

తాండూరు, జూలై 2 (విజయక్రాంతి): పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా పాఠ్య పుస్తకాలను విక్రయిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఎఫ్‌ఐ , పిడిఎస్యు విద్యార్థి,  సిఐటియు, కేవీపీఎస్, ప్రజా సంఘాల నాయకులు గురువారం అడ్డుకున్నారు. దీనికి ప్రిన్సిపాల్ సమాధానం చెప్పక పోవడంతో సిబ్బంది తీరుపై ఎంఈఓ కు ఫిర్యాదు చేశారు. పాఠశాలకు చేరుకున్న ఆమె పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.