3 July, 2026 | 1:14 AM

విద్యుత్ శాఖ నరికివేత.. అటవీ శాఖ అడ్డగింత

03-07-2026 12:25 AM

జగదేవపూర్, జూలై 2: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెంచిన చెట్లను విచ్చలవిడిగా నరికివేయడంతో అటవీ శాఖ అధికారులు అడ్డుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలో గురువారం జరిగింది. జగదేవపూర్ గొల్లపల్లి గ్రామాల మధ్య గల రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెట్లను లైన్ మెన్ మహిపాల్ రెడ్డి ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీ తో విచ్చలవిడిగా నరికివేశారు. అయితే విద్యుత్ తీగల కింద చెట్లు పెరిగితే ముందస్తుగా సంబంధిత శాఖ కు సమాచారమిచ్చి అవసరమైన అనుమతులు తీసుకొని నిబంధనల మేరకు గొడ్డలితో నరికివేస్తారు.

కానీ ప్రభుత్వ శాఖ అయినప్పటికీ నిబంధనలు పాటించకుండా చెట్లను హిస్టారీతిగా జెసిబి సహాయంతో నరికి వేయడం అటవీశాఖ అధికారులకు ఆగ్రహాన్ని తెప్పించింది దాంతో అటవీశాఖ బీట్ ఆఫీసర్ స్వా మి చెట్ల నరికివేతను అడ్డుకున్నారు అనుమతులు లేకుండా చెట్లు నరికి వేయడం పట్ల ఆ గ్రహం వ్యక్తం చేస్తూ నిబంధనల మేరకు, ప ద్దతి ప్రకారంగానే చెట్లు నరికివేయాలని ఆదేశించారు. ఈ విషయంపై లైన్ మెన్ మహి పాల్ రెడ్డి నీ వివరణ కోరగా తను స్వచ్ఛందంగా ప్రజా సేవ చేస్తుంటే అటవీ శాఖ అధికారులు అడ్డుపడుతున్నారని చెప్పారు.