సీనియర్ అధికారిణి లక్ష్మీభాయి బదిలీ
- హౌసింగ్ ఫెడరేషన్ ఎండీగా నియామకం
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- రాజకీయ కక్ష సాధింపు చర్యే: బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్‌పీ
హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా విభాగంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భార్య, సీనియర్ అధికారిణి లక్ష్మీభాయిని బదిలీ చేస్తూ ప్రభు త్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా విధులను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం ఆమెను ఆ బాధ్యతల నుంచి బదిలీ చేసి, హౌసింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా నియమించారు. రా ష్ట్రంలో ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారుల బదిలీల పరంపరలో భాగంగానే ఈ కీలక స్థానచలనం జరిగినట్లు సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే ఇప్పటికే వ్యక్తిగత సిబ్బందితో పాటు కారు సౌకర్యాన్ని తొలగించిన ప్రభుత్వం తా జాగా లక్ష్మీభాయిని కూడా బదిలీ చేయడంపై ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తీవ్రంగా స్పం దించారు. దీనిపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కక్షసా ధింపు చర్యల్లో భాగంగానే ఈ బదిలీలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కానీ తాము అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చామని స్పష్టం చేశారు. పొలిటికల్‌గా తమను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, అందులో భాగంగానే తొలుత తన భద్రతను తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు అసలే సంబంధం లేని ఇతర విభాగానికి బదిలీ చే శారని ధ్వజమెత్తారు. ఇలాంటి బెదిరింపులకు, కక్షసాధింపు చర్యలకు తాము భయప డేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఎన్ని అ డ్డంకులు సృష్టించినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.






