3 July, 2026 | 2:18 AM

పేదల ఇళ్లనే కూలుస్తున్నారు

03-07-2026 01:10 AM
  1. హైడ్రా, జీహెచ్‌ఎంసీలపై హైకోర్టు ఆగ్రహం    
  2. తార్నాక ఎర్రకుంట ఆక్రమణలపై విచారణ
  3. ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదన్న పిటిషనర్
  4. ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్న ఉన్నత న్యాయస్థానం
  5. తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా

హైదరాబాద్, జులై 2(విజయక్రాంతి): హైడ్రా, జీహెచ్‌ఎంసీ కేవలం పేదల ఇళ్లను మాత్రమే కూలుస్తున్నాయంటూ రాష్ట్ర హై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గురువారం తార్నాకలోని ఎర్రకుంట ఆక్రమణల పై న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చే సిన రిట్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వి చారణ చేపట్టింది. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎర్రకుంట చెరువు క్రమక్రమం గా ఆక్రమణలకు గురవుతూనే ఉందని పిటిషనర్ ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసు కొచ్చారు.

ఈ విషయంలో జీహెచ్‌ఎంసీ ఉ న్నతాధికారులు, హైడ్రా, లేక్ ప్రొటెక్షన్ కమిటీకి ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకునే నాథు డే కరువయ్యాడని పిటిషనర్ తన వాదనలో పేర్కొన్నారు. దీంతో ధర్మాసనం కలుగజేసుకుని జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వాళ్లు కేవ లం పేదోళ్ల ఇళ్లనే కూలుస్తారని,వాళ్లనే లక్ష్యంగా చేసుకుని కూలుస్తారని పేర్కొంది. ఇ లాంటి ఫిర్యాదులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ప్రశ్నించింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీతో పాటు హైడ్రా, నీటి  పారుదల శాఖలకు హైకోర్టు నోటీసులు జా రీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది.