‘వీబీ జీరామ్‌జీ’కి వ్యతిరేకంగా నిరసనలు
గుమ్మడిదల, జులై 2: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ’వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ ఆజీవికా మిషన్ (గ్రామీన్) వీబీ-జి రామ్ జీ చట్టం 2025’ను వ్యతిరేకిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని న్యూల్యాండ్ పరిశ్రమ కార్మికులు గుమ్మడిదల మండల పరిధిలోని గ్రామాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీలు గురువారం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బి.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎంజిఎన్‌ఆర్ ఈజిఏ, స్థానంలో కొత్త చట్టం రానుందన్నారు ఇది గ్రామీణ నిరుపేదల ఉపాధి హామీకి తీవ్ర విఘాతం కలిగిస్తుందని సీఐటీయూ, జిల్లా ఉపాధ్యక్షుడు బి నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత ఉపాధి హామీ చట్టంలో కార్మికుల సంక్షేమం కోసం ఉన్న సౌకర్యాలను కొత్త వీబీజీ రామ్ జీ చట్టంలో పూర్తిగా తొలగించారని, కార్మికులకు నష్టం చేస్తుందన్నారు.
కేంద్రం నిధులను 90 శాతం నుంచి 60 శాతాకి కుదించి, మిగతా 40 శాతం రాష్ట్రాలు భరించాలని చెప్పడం వల్ల ఉపాధి కల్పించే బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంటోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీధర్ రావు, కమ్మరి రవీందర్ చారి, దేవేందర్, టి నరసింహ గౌడ్, బి గోపాల్ రెడ్డి, వైబిఆర్ వర్మ, ఎన్ రామకృష్ణ, పివి రామరాజు, వి నాగరాజు, కె నగేష్, ఎన్ నాగరాజు, పి గోవిందరావు, సతీష్ బాబు, అనూష రెడ్డి, సుంచు నర్మదా, చిన్న స్వప్న, ఇందిరమ్మ, చాపల సుధాకర్, గడ్డం లావణ్య గోవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






