అలాంటి కథైతేనే వరుణ్‌తో చేస్తా!
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మో హన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. తాతినేని సత్య దర్శకత్వం వహించారు. దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని మే 8న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా బుధవారం హీరోయిన్ లావణ్య త్రిపాఠి మీడియాతో చెప్పిన సంగతులివీ..
* ‘సతీ లీలావతి’ కథ విన్న సంగతి వరుణ్ తేజ్‌కు చెప్పా. అప్పుడు నాకు ప్రెగ్నెంట్ అని తెలీదు, ఎలాంటి సింప్టమ్స్ కూడా లేవు. షూటింగ్ టైమ్‌లోనే ప్రెగ్నెంట్ అని తెలిసింది. షూటింగ్ కూడా అంత ఈజీ కాదని అర్థమైంది. ఈ మూవీ కోసం వెయిట్ కూడా తగ్గాను. కానీ నాకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిం దో తెలీదు.
టీమ్ సపోర్ట్‌తో సాఫీగా చేశా. రోజూ షూటింగ్ తర్వాత హాస్పిటల్ వెళ్లి చెకప్ చేసుకునేదాన్ని. ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే మాత్రం షూటింగులకు బ్రేక్ ఇస్తా. ప్రస్తుతం నేను సినిమాల్ని ఒప్పుకోవడం లేదు. ఫ్యామిలీకే టైమ్ కేటాయించా లనుకుంటున్నా. నా కొడుకుతోనే నాకు టైమ్ సరిపోతోంది. కాస్త గ్యాప్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యా.
* వరుణ్‌తో కలిసి నటించాలని ఉంది. ఈ మధ్యే ఓ కథ కూడా వచ్చింది. కానీ మేం రియల్ లైఫ్‌లో కలిసే ఉన్నాం. తెరపైనా అలానే కనిపించాలంటే కథ కాస్త కొత్తగా, విభిన్నంగా ఉండాలి. భవిష్యత్తులో అలాంటి కథ వచ్చినప్పుడు ఆలోచిస్తాం.
* నేను ఈ చిత్రంలో డైరెక్టర్ పాత్రలో కనిపిస్తా. వినోదం, కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు. కొన్నిచోట్ల ఎమోషనల్‌గా ఉంటుంది. మంచి మెసేజ్ ఉన్నా.. ఏదో బోధిస్తున్నట్టు, క్లాస్ పీకుతున్నట్టు అనిపించదు.
* ఈ సినిమాలో చూపించినట్టు రిలేషన్స్ బయటి ప్రపంచంలో ఉండవు. అలాంటి పరిస్థితి కూడా ఏ మహిళకీ రాకూడదు. నాకు రియల్ లైఫ్‌లో వరుణ్ లాంటి మంచి భర్త దొరికారు. ప్రస్తుతం నా భర్త, కొడుకుతో హ్యాపీగా ఉన్నా.
* నేను ప్రెగ్నెంట్ కదా అని స్క్రిప్టులో మార్పులు చేయలేదు. యాక్షన్ సీక్వెన్స్‌లో మార్పులు చేశారు. ఫస్ట్ టైమ్ యాక్షన్ సీక్వెన్స్ చేశా. కాలితో తన్నే సీన్ కాస్త ఇబ్బందిగా అనిపించింది.
* కమల్‌హాసన్ ‘సతీ లీలావతి’ ఒక క్లాసికల్. ఆ చిత్రంతో మా సినిమాను పోల్చలేం. కానీ, వినోదాత్మకంగా సాగుతుంది.






