15 May, 2026 | 11:48 PM

Breaking News

ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

14-03-2026 12:16 AM

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం

సికింద్రాబాద్, మార్చ్13 (విజయక్రాంతి): పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని, సామరస్యాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఓల్ బోయిన్ పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఓల్ బోయిన్ పల్లి వల్లభ నగర్ ఈద్గా వద్ద రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ముస్లిం మైనారిటీ మత పెద్దలతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.