20-02-2026 01:35:05 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి) : మేడారం జాతర ను ఘనంగా నిర్వహించినందుకు మంత్రి సీతక్కను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అభినందించారు. మేడారం జాతర చరిత్ర, ప్రాశస్త్యం గురించి మంత్రిని అడిగి తెలుసుకున్నారు. మేడారం జాతరను ఘనంగా నిర్వహించినందుకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి సీ తక్కను కాంగ్రెస్ అగ్రనేతలు అభినం దించారు.
ఆదివాసీల అతిపెద్ద జాత రగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరపై సుమారు పది నిమిషాల పాటు చర్చ జరిగింది. సమ్మక్క- సారల మ్మల పోరాట గాథను ఖర్గే, రాహుల్ ఆసక్తిగా విన్నారు. సమ్మక్క - సారల మ్మల చరిత్రను దేశవ్యాప్తంగా చాటేం దుకు సినిమా తీయాలని రాహుల్ గాంధీ సూచించారు. కాగా, పార్టీ స మావేశంలో మంత్రి సీతక్క, రాహుల్ గాంధీ మధ్య సరదా సంభాషణ జరి గింది. మేడారం జాతరకు ఆహ్వానిస్తే తాము తప్పకుండా హాజరయ్యేవార మని రాహుల్ గాంధీ అన్నారు.
‘ఆహ్వానిస్తే తాను కూడా తల్లుల దర్శ నానికి వచ్చే వాడిని’ అని మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. అయితే సమయా భావం వల్ల వ్యక్తిగతంగా ఆహ్వానించ లేకపోయినట్లు మంత్రి సీతక్క వివ రించారు. వచ్చే జాతరకు తప్పకుండా అధికారిక ఆహ్వానం అందిస్తామని సీతక్క అన్నారు. ‘ఆహ్వానం అందితే తప్పకుండా వస్తాము’ అని రాహుల్ గాంధీ, ఖర్గే హామీ ఇచ్చారు.