26 July, 2026 | 2:12 AM

సూర్య వెడ్డింగ్ సాంగ్ పాడితే..

26-07-2026 12:00 AM

తమిళ అగ్ర కథానాయుడు సూర్య ప్రధాన పాత్రలో దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్న చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిని మా స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 14న విడుదల కానుంది.

తాజా గా ఈ చిత్రం నుంచి ‘ది వెడ్డింగ్ సాంగ్’ను విడుదల చేసింది చిత్రబృం దం. ఈ పాటను హీరో సూర్య స్వయంగా ఆలపించడం విశేషం. ఈ గీతానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం సమకూర్చగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాటలో సూర్య, మమితా బైజు అందంగా మెరిపోతూ, తమ నృత్యంతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి డీవోపీ: నిమిష్ రవి; ఎడిటింగ్: నవీన్ నూలి; ఆర్ట్: బంగ్లాన్.