calender_icon.png 7 February, 2026 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్కసారి అవకాశం ఇస్తే ఐదు సంవత్సరాలు సేవలందిస్తా

07-02-2026 12:07:30 AM

ఎల్లంపేట్ మున్సిపల్ 10వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి గౌరయ్యగారి సుప్రియ శ్రీనివాస్ గౌడ్

మేడ్చల్ అర్బన్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి):ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని 10 వ మున్సిపల్ వార్డు నుండి బిజెపి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరయ్యగారి సుప్రియ శ్రీనివాస్ గౌడ్ ఒక్కసారి అవకాశం కల్పిస్తే ఐదు సంవత్సరాలు మీకు సేవలు అందిస్తానని ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో ఓటర్లను అభ్యర్థించారు.శుక్రవారం ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపల్ 10వ వార్డులో ఆమె బిజెపి కరపత్రాలతో పాటు కండువాలు కప్పుకొని ఒక్కసారి నన్ను కౌన్సిలర్ గా గెలిపిస్తే ఐదు సంవత్సరాలు మీకు సేవలు అందిస్తానని ప్రతి ఓటర్ ను అభ్యర్థించినట్లు తెలిపారు.

కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలోని పేద బడుగు బలహీన వర్గ ప్రజలకు నెలకు ఒక్కొక్కరికి ఇచ్చే ఆరు కిలోల రేషన్ బియ్యంలో కేంద్రమే ఐదు కిలోలు ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక కిలో బియ్యం మాత్రమే ప్రజలకు అందిస్తున్న విషయాన్ని వార్డు హోటళ్లకు తెలియజేసినట్లు ఆమె చెప్పారు.అంతే కాకుండా ప్రతి గ్రామానికి మున్సిపల్ పట్టణానికి కేంద్ర ప్రభుత్వం స్మశాన వాటికలు అంగన్వాడి కేంద్రాలతో పాటు ఆయుష్మాన్ భారత్ పథకంతో పేద ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తుందని బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి సుప్రియ శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

దేశంలోని రైతన్నలకు సంవత్సరానికి 6000 రూపాయల పెట్టుబడి అవకాశం కల్పిస్తున్న నరేంద్ర మోడీ పథకాలను ప్రజలు ఆస్వాదిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని 10 వ వార్డు నుండి బిజెపి మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఒకసారి అవకాశం కల్పిస్తే ఐదు సంవత్సరాలు మీకు నిరంతర సేవలు అందిస్తానని ఆమె వార్డు ఓటర్లను కోరినట్టు చెప్పారు.

నూతనంగా ఏర్పడిన ఎల్లంపేట మున్సిపల్ పట్టణంలో సిసి రోడ్లు,అంతర్గత మురికి కాలువలు,త్రాగునీటి సమస్య,వీధి దీపాలు ఏర్పాటు చేయుటకు మల్కాజిగిరి బిజెపి పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రి వర్యులు ఈటల రాజేందర్ సహకారంతో అభివృద్ధికి పాటుపడతానని కౌన్సిలర్ అభ్యర్థి గౌరయ్యగారి సుప్రియ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పదవ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా వాడు ఓటర్లు పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు..