18 July, 2026 | 7:12 PM

Breaking News

నాణ్యమైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు   •   పరిసరాల సేవా వీరులు   •   మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •  

అక్రమంగా నిర్మిస్తే అనుమతులు రద్దు చేస్తాం

30-05-2026 12:35 AM
  1. మున్సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి
  2. సెల్లార్ నిర్మాణాన్ని అడ్డుకున్న అధికారులు

తాండూరు, మే 29,(విజయక్రాంతి) వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ‘నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ నిర్మాణం‘ చేస్తున్నారని  విజయ క్రాంతి దినపత్రికలో ఈనెల 27వ తేదీన వచ్చిన వార్తకు మున్సిపల్ అధికారులు స్పందించారు. శుక్రవారం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు  పట్టణంలోని నెహ్రూగంజ్ ఎల్లమ్మ దేవాలయం ప్రక్కన నిర్మిస్తున్న సెల్లార్ పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ నిర్మిస్తే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.