22 April, 2026 | 12:08 PM

Breaking News

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె ప్రభావం.. డిపోకే పరిమితమైన బస్సులు   •   కాళేశ్వరం కేసులో KCR, Harishలకు భారీ ఊరట: హైకోర్టు సంచలన తీర్పు   •   పీసీ ఘోష్ కాళేశ్వరం నివేదికపై తుది తీర్పు   •   ఆర్టీసీ కార్మికుల సమ్మె— రోడ్డెక్కని బస్సులు   •   కామారెడ్డి బస్టాండ్‌లో ఉద్రిక్తత.. బస్సు గాలి తీసేసిన ఆర్టీసీ కార్మికులు   •   తెలంగాణలో ఆర్టీసీ సమ్మె— ప్రయాణికులకు తిప్పలు   •   సత్తుపల్లిలో హోరెత్తిన ఆర్టీసీ సమరభేరి: స్తంభించిన రవాణా వ్యవస్థ   •  

ఇబ్రహీంపట్నం మున్సిపల్ కుర్చీలాట

19-02-2026 12:05 AM

హైకోర్టులో ‘మిస్సింగ్’ డ్రామా సుఖాంతం.. ఇక ఎన్నికకు లైన్ క్లియర్!

రంగారెడ్డి/ అబ్దుల్లాపూర్‌మెట్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో గత కొద్ది రోజులుగా సాగుతున్న హైడ్రామాకు తెరపడింది. చైర్మన్ పీఠం కోసం సాగిన రాజకీయ చదరంగం చివరకు న్యాయస్థానం మెట్లు ఎక్కగా, హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో ఎన్నికల ప్రక్రియకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. అదృశ్యమైన కౌన్సిలర్ కోర్టులో ప్రత్యక్షం కావడంతో ఈ ఉత్కంఠకు ముగింపు పలికినట్లయింది.

అదృశ్యమైన కౌన్సిలర్.. హైకోర్టులో ప్రత్యక్షం!

మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ముంగిట 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అకస్మాత్తుగా అదృశ్యం కావడం కలకలం రేపింది. తన తండ్రిని కిడ్నాప్ చేశారంటూ ఆయన కుమారుడు హరికాంత్ వేసిన హెబియస్ కార్పస్ పిటిష్ప హైకోర్టు సీరియస్గా స్పందించింది. పోలీసుల నిఘా నీడలో యాదగిరిని కోర్టు ముందు హాజరుపరచగా.. తాను క్షేమంగానే ఉన్నానని, ఎవరి ఒత్తిడి లేదని ఆయన వాంగ్మూలం ఇవ్వడంతో స్టేను ఎత్తివేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.

మున్సిపల్ ఎన్నిక చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో భాగంగా ఎవరికీ భయపడొద్దు.. స్వేచ్ఛగా ఓటు వేయండి అని ఈ వివాదంలో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కౌన్సిలర్ యాదగిరిపై ఎలాంటి రాజకీయ లేదా పోలీస్ ఒత్తిడి ఉండకూడదని స్పష్టం చేసింది. ఆయన స్వచ్ఛందంగా, తన ఇష్టానుసారం ఎన్నిక ప్రక్రియలో పాల్గొనేలా చూడాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. దీనితో కలెక్టర్ మరియు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఇక తుది నిర్ణయం తీసుకోవడానికి మార్గం సుగమమైంది. దీంతో ఇక ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సాఫి గా సాగుతున్న తరుణంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.

తప్పుడు పత్రాలతో ‘కౌన్సిలర్’ గెలుపు?

ఒకవైపు కోర్టు వివాదం సద్దుమణుగుతుండగానే, 23వ వార్డులో గెలిచిన BRS అభ్యర్థి నీలం శ్వేతపై కాంగ్రెస్ అభ్యర్థి చంద్రకళ సంచలన ఆరోపణలు చేశారు. శ్వేత తప్పుడు ధ్రువపత్రాలతో పోటీ చేసి గెలిచారని, ఆమెను వెంటనే అనర్హురాలిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే RDO, మున్సిపల్ కమిషనర్లకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో.. ఒకవేళ ఆమె పదవి కోల్పోతే మున్సిపాలిటీలో సమీకరణాలు తలకిందులయ్యే అవకాశం ఉంది.

ఉత్కంఠలో కేడర్.. ఊపిరి పీల్చుకున్న అభ్యర్థులు!

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న మున్సిపాలిటీల్లో ఇబ్రహీంపట్నం ఒకటి కావడం, ఇక్కడ గెలుపు ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. హైకోర్టు స్టే ఎత్తివేయడంతో, బీఆర్‌ఎస్ అభ్యర్థి టేకు సుదర్శన్ రెడ్డి చైర్మన్ పీఠంపై కూర్చుంటారా? లేక కాంగ్రెస్ ఫిర్యాదులతో సమీకరణాలు మారుతాయా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాజకీయం ఏదైనా.. అంతిమంగా ధర్మమే గెలిచిందని యాదగిరి అనుచరులు సంబరాలు చేసుకుంటుండగా, ‘అనర్హత‘ వేటు పడితే పరిస్థితి ఏంటని విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి.