10 May, 2026 | 11:34 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

16 మంది అధికారులకు ఐఏఎస్ హోదా

22-01-2026 01:17 AM

గెజిట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వివిధ కేటగిరీల కింద ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ మొత్తం 16 మంది అధికారులకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్ ) హోదా కల్పిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 2022, 2023, 2024 సంవత్సరాలకు సంబంధించి ఎంపిక చేసిన అధికారులను తెలంగాణ క్యాడర్‌కు కేటాయిస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

ఎంపికైన అధికారుల జాబితా 2022కి చెందిన వారిలో డి మధుసూదన్ నాయక్, ఎం సత్యవాణి, జె భవానీ శంకర్, జి లింగయ్య నాయక్, ఎ నరసింహా రెడ్డి, జి వీరారెడ్డి, జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, యు రఘురామ్ శర్మ, పి చంద్రయ్య, జి ముకుంద రెడ్డి, ఎ భాస్కర్ రావు ఉన్నారు. ఇక 2023కు సంబంధించి వైవీ గణేశ్, అబ్దుల్ హమీద్, బి వెంకటేశ్వర్లు ఉన్నారు. -2024లో ఎన్‌ఖీమ్యా నాయక్, కె.గంగాధర్ ఉన్నారు. అయితే ఈ నియామకాలు తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్ తుది తీర్పునకు లోబడి ఉంటాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సుదీర్ఘ కాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర సివిల్ సర్వీస్ అధికారులకు ఈ నిర్ణయంతో భారీ ఊరట లభించింది.